ఏ ఉద్దేశంతో విధుల్లో చేరానో వాటిని అమలు చేయలేకపోతున్నానని ఐఏఎస్ అధికారి వృత్తికి రాజీనామా చేశారు. కేరళకు చెందిన ఐఏఎస్ అధికారి గోపీనాథ్ కన్నన్ ప్రస్తుతం దాద్రానగర్ హావేలిలో పవర్ అగ్రికల్చర్,పట్టణాభివృద్ధి కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.ఇటీవల జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేకహోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు.జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ప్రత్యేక ప్రతిని రద్దు చేసి ఆ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాశారని పేర్కొన్నారు.గొంతు లేని వారికి తాను గొంతుక కావాలని అనుకున్నానని పేర్కొన్నారు.ఆర్టికల్ 370 రద్దు విషయంలో తన భావాల్ని స్వేచ్ఛగా వ్యక్తపర్చలేకపోయాననే ఆవేదన తనను తొలిచేస్తోందని కన్నన్ పేర్కొన్నారు.దీనిపై తన గొంతును కూడా విప్పే పరిస్థితి లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.తనకు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ముఖ్యమని, అది లేకుండా తాను విధుల్లో కొనసాగలేనని గోపీనాథ్ కన్నన్ స్పష్టం చేశారు. 370 ఆర్టికల్ను రద్దు చేసి లక్షలాది మంది జమ్మూకాశ్మీర్ ప్రజల హక్కులను కాలరాసినా.. భారత ప్రజలు ఏమాత్రం స్పందించడం లేదని అన్నారు. ఇది తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు.తనను రిలీవ్ చేయాలంటూ హోం సెక్రటరీకి లేఖ రాశారు. గత సంవత్సరం కేరళలో సంభవించిన భారీ వర్షాలు, వరదల్లో సామాన్యుడిలా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.తోటి అధికారి కలెక్టర్ అని గుర్తించే వరకు కూడా కన్నన్ ఎవరో తెలియకపోవడం గమనార్హం..