తెలంగాణకు అమ్రపాలి గుడ్‌బై..

తెలంగాణకు అమ్రపాలి గుడ్‌బై..

 అమ్రపాలి కాటా ఐఏఎస్‌ ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు,ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు.అంతలా తన మీడియాలో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ సెలెబ్రిటీ హోదాను సొంతం చేసుకున్నారు అమ్రపాలి.చిన్న వయసులోనే ఐఏఎస్‌కు ఎంపిక కావడంతో పాటు అందానికి అందం విధినిర్వహణలో నిజాయితీ,నిబద్దత ఇలా అన్నింట్లోనూ యువతకు రోల్‌మోడల్‌గా నిలిచారు.ట్రైనీగా తెలంగాణకు వచ్చిన అమ్రపాలి వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా పని చేసిన సమయంలో మీడియా దృష్టి అమ్రపాలిపై మరికొంత పెరిగింది.తాను ఉంటున్న బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయంటూ అమ్రపాలి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.అనంతరం జరిగిన పరిణామాలతో అమ్రపాలిపై అసహనం వ్యక్తం చేసిన కేసీఆర్‌ జీహెచ్ ఎంసీ జోనల్ కమిషనర్ అన్న అప్రాధాన్యత పదవికి  బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.అప్పటి నుంచి మీడియాలో కనిపించడం మానేశారు.ఈ తరుణంలో మరోసారి అమ్రపాలి వార్తల్లో నిలిచారు.అయితే ఈసారి సంచలనంగా మారి కాదు తెలంగాణ నుంచి బదిలీ కావడంతో అమ్రపాలి వార్తల్లో నిలిచారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి కార్యాలయంలో విధులు నిర్వహించేందుకు అమ్రపాలి ఎంపికయ్యారు.కిషన్ రెడ్డి కార్యాలయంలో ఓఎస్డీగా బాధ్యతలు చేపట్టనున్నారు. మేరకు అమ్రపాలిని కేంద్ర సర్వీసులోకి పంపాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వర్తమానం అందింది. మొత్తానికి సెలబ్రిటీ ఐఏఎస్ ఒక కలెక్టర్ లా హుందాగా అనే కంటే స్టూడెంట్ లా జోవియల్ గా కనిపిస్తూ యూత్ ఐకాన్ లా కనిపించే అమ్రపాలికి యూత్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. అందరితోనూ స్నేహంగా ఉండటం, ముక్కుసూటిగా వ్యవహరించటంతో పాటు,యాక్టివ్ గా ఉండేవారు అమ్రపాలి. తక్కువ కాలంలోనే సెలబ్రిటీ ఐఎఎస్ గా మారిపోయారు.వినాయకచవితికి అమ్రపాలి విగ్రహాన్ని చేయించి ఆమె ఒడిలో వినాయకుడిని పెట్టి యూత్ హంగామా చెయ్యాలని చూశారు అంటే ఎంతగా అమ్రపాలి క్రేజ్ ఉండేదో అర్ధం చేసుకోవచ్చు.ఈ తరుణంలో అమ్రపాలి కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లిపోతుండడం కొంచెం బాధాకరంగానే ఉన్నా తెలుగు రాష్ట్రానికి చెందిన కలెక్టర్‌ కేంద్రస్థాయిలో కూడా ఒక వెలుగు వెలగాలని కోరుకుంటూ వీడ్కోలు పలుకుదాం..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos