గతంలో తనకు గంజాయి అలవాటు ఉండేదని అయితే త్వరగానే దాని మత్తు నుంచి బయటకు వచ్చేశానంటూ తమిళ దర్శకుడు,నటుడు భాగ్యరాజ్ వెల్లడించడం తమిళ సినీ పరిశ్రమల్లో చర్చనీయాంశమైంది.ఓ తమిళ సినిమా ఆడియో ఫంక్షన్‌లో పాల్గొన్న భాగ్యరాజ్ అప్పట్లో కోయంబత్తూరులో తన అసిస్టెంట్ ఒకరు గంజాయితో కూడిన సిగరెట్ బలవంతంగా తాగించాడన్నారు.మొదట్లో బాగానే ఉన్నా తరువాత దాని ప్రభావం తెలుస్తుందని గంజాయి తీసుకుంటే పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తుంటామన్నారు.అలా గంజాయికి అలవాటు పడిన తాను ఒక సమయంలో ఏదేదో సాధించాలని వచ్చి ఇలా అయిపోయానేంటి? అన్న ఆలోచన రావడంతో ఎంతో కష్టపడి ఆ అలవాటు మానుకున్నానని తెలిపారు. ప్రస్తుతం సిగరెట్ తాగడం కూడా మానేశానని చెప్పారు. ఎనర్జీ అనేది వయసును బట్టి కాకుండా మనసును బట్టి ఉంటుందన్నారు..