స్వాతంత్య్ర ఉద్యమంలో జలియన్ వాలాబాగ్ ఉదంతం గురించి తెలియని భారతీయుడు ఎవరూ ఉండరేమో.బ్రిటీషర్ల అత్యంత హేయమైన చర్యగా చరిత్రలో నిలిచిపోచిన మారణహోమ ఉదంతం నేటీకి భారతీయులను కలచివేస్తూ ఉంటుంది.జలియన్ వాలాబాగ్ ఘటనపై తాజాగా బ్రిటన్లోని కాంటర్బరీ ఆర్క్బిషప్ జస్టిన్ వెల్బీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఘటనకు సిగ్గుపడుతున్నానని తెలిపారు.భారత్లోని జలియన్వాలా బాగ్ స్మారక స్థూపాన్ని స్థూపం ఎదుట మృతి చెందిన వారికి ఆయన సాష్టాంగ నమస్కారం చేసి నివాళులు అర్పించారు. అక్కడికి చేరి వచ్చిన ప్రజలనుద్దేశించి ఈ ఘటనకు పాల్పడిన వారిని దేవుడు క్షమించాల్సిందిగా ప్రార్థనలు చేశారు.”నాటి బ్రిటీషు పాలకులు పాల్పడిన ఈ ఘాతుకంకు సంబంధించిన జ్ఞాపకాలు ఇంకా ఈ స్థూపం రూపంలో బతికేఉన్నాయి. ఈ నేరానికి పాల్పడిన బ్రిటీషు వారి తరపున నేను క్షమాపణలు కోరుతున్నాను. నిజంగా ఈ ఘటనపై సిగ్గు పడుతున్నాను, ఒక మతాధిపతిగా ఈ ఘటనను ఖండిస్తున్నాను” అని ఆర్చ్ బిషప్ జస్టిన్ వెల్బీ చెప్పారు. అంతే కాదు జలియన్వాలాబాగ్ను సందర్శించిన ఫోటోలను పెడుతూ ఆయన ట్వీట్ కూడా చేశారు. ఇక్కడ సిక్కులు, హిందువులు, క్రైస్తవులు, ముస్లింలను 1919లో బ్రిటీష్ బలగాలు ఊచకోత కోశాయని యూకే తరపున క్షమించాల్సిందిగా కోరేంత అర్హత తనకు లేదని అయితే వ్యక్తిగతంతా తాను క్షమించాల్సిందిగా కోరానని తన ఫేస్బుక్పోస్టులో రాసుకొచ్చారు.జలియన్వాలా బాగ్ ఘటన జరిగి 100ఏళ్లు పూర్తయిన సమయంలో బ్రిటన్ మాజీ ప్రధాని థెరిసా మే మాత్రం ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు..

సాష్టాంగ నమస్కారం చేస్తున్న ఆర్క్బిషప్ జస్టిన్ వెల్బీ