హైదరాబాద్-కర్ణాటక ఇకపై కళ్యాణ కర్ణాటక

హైదరాబాద్-కర్ణాటక ఇకపై కళ్యాణ కర్ణాటక

కర్ణాటక రాష్ట్రంలో భౌగోళికంగా,రాజకీయంగా,చారిత్రాత్మకంగా ఎంతో కీలకమైన ఉత్తర కర్ణాటక ప్రాంతాన్ని ఇకపై కళ్యాణ కర్ణాటకగా వ్యవహరిస్తామంటూ కర్ణాటక సీఎం యడియూరప్ప స్పష్టం చేశారు.దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు చేస్తున్న డిమాండ్ను పరిగణలోకి తీసుకొని ఈ ప్రాంతాన్ని కళ్యాణ కర్ణాటకగా వ్యవహరించడానికి నిర్ణయించుకున్నట్లు తెలిపారు.కళ్యాణ-కర్ణాటక ప్రాంత సమగ్రాబివృద్ధికి ప్రత్యేక సచివాలయం ఏర్పాటు చేస్తామన్నారు.బెళగావి,బాగల్కోటె,విజయపుర,కలబురిగి,బీదర్, రాయచూర్, యాదగిరి, బళ్లారి, కొప్పళ,ధార్వాడ,హావేరి,గదగ్ జిల్లాలతో కూడిన ఈ ప్రాంతాన్ని దశాబ్ధాలుగా హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంగానే వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాంతం గతంలో హైదరాబాద్ కేంద్రంగా నిజాం రాజ్యంలో అంతర్భాగంగా ఉండేది. సంస్ధానాల విలీనం అనంతరం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో కర్ణాటకలో కలిసినప్పటికీ ఆరు జిల్లాలతో కూడిన ఈ ప్రాంతాన్ని హైదరాబాద్-కర్ణాటకగానే వ్యవహరిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos