బాలికపై పైశాచికం..

బాలికపై పైశాచికం..

మహిళా దినోత్సవం రోజునే హైదరాబాద్‌ నగరంలో దారుణం చోటు చేసుకుంది.తనతో పాటు చదువుకుంటున్న బాలికపై గంజాయి మత్తులో ఓ బాలుడు బ్లేడుతో బాలిక శరీరంపై దాడి చేశాడు. చంద్రనగర్‌కాలనీ,లిబర్టీ,ఆయిల్‌సీడ్స్‌ కాలనీ ప్రాంతాలకు చెందిన కొంతమంది యువకులు పాలిటెక్నిక్‌ చదువుతున్నారు.గంజాయికి బానిసలైన యువకులు తరచూ లోయర్‌ట్యాంక్‌ బండ్‌లోని డీబీఆర్‌ మిల్స్‌ ప్రాంతంలోనున్న నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి మద్యం,గంజాయి తాగుతుండేవారు.కొద్ది రోజుల క్రితం అదే కాలేజీలో పాలిటెక్నిక్‌ చదువుతున్న బాలికను పరిచయం చేసుకున్న నిందితుల్లో ఒక యువకుడు మెల్లిగా బాలికకు కూడా గంజాయి అలవాటు చేశాడు.ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం నిందితుడు గంజాయి మత్తులో ఉండగా బాధితురాలిపై అత్యాచారం చేయగా నిందితుడి స్నేహితులు అత్యాచార ఘటనను వీడియో తీశారు.ఈ విషయం తెలిసి వీడియోలు డిలీట్‌ చేయాలంటూ ప్రాధేయపడింది.వీడియో డిలీట్‌ చేయాలంటూ శుక్రవారం రాత్రి డీబీఆర్‌ మిల్స్‌ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశానికి రావాలంటూ సూచించాడు.దీంతో స్నేహితురాలి ఇంటికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి నిందితులు సూచించిన ప్రదేశానికి వెళ్లింది.అప్పటికే పీకలదాక మద్యం తాగి గంజాయి మత్తులో ఉన్న నిందితులు బాలికను వివస్త్రను చేసి బ్లేడుతో బాలిక శరీరంపై ఇష్టమొచ్చినట్లు దాడి చేశారు.తమ రాక్షసకృత్యాలను వీడియో తీసి యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్‌ చేశారు.బాలిక కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని బాలికను రక్షించి నిందితులకు దేహశుద్ధి చేశారు.అటుపై నిందితుల మొబైల్‌లో ఉన్న వీడియోలు డిలీట్‌ చేసి గాంధీనగర్‌ పోలీసులకు అప్పగించారు.నిందితులపై పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను గాంధీ ఆసుపత్రికి తరలించారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos