కరోనాకు హాట్ స్పాట్స్ గా మారుతున్న బెంగుళూరు,హైదరాబాద్

కరోనాకు హాట్ స్పాట్స్ గా మారుతున్న బెంగుళూరు,హైదరాబాద్

మహారాష్ట్ర,ఢిల్లీ,గుజరాత్ తదితర రాష్ట్రాల్లో పెరుగుతున్నట్లే దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక,తమిళనాడు,తెలంగాణ రాష్ట్రాల్లో సైతం వైరస్ వ్యాప్తి చాల వేగంగా పెరుగుతోంది.గత కొన్ని రోజులుగా బెంగళూరు, హైదరాబాద్ న‌గరాలలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గత రెండు రోజుల్లో బెంగళూరులో నమోదైన పాజిటివ్ కేసులు ముంబయిని మించిపోయాయి.ముంబయిలో శనివారం నాడు 1337 పాజిటివ్ కేసులు నమోదైతే, అదే రోజు బెంగళూరులో 1533 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ముంబయిలో 73 మరణాలు చోటు చేసుకుంటే బెంగళూరులో 27 మరణాలు చోటు చేసుకున్నాయి.హైదరాబాద్లో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది. శనివారం హైదరాబాద్ లో 736 పాజిటివ్ కేసులు నమోదు కాగా 9 మరణాలు చోటు చేసుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాలలో తమిళనాడులో 3671 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 69 మరణాలు చోటు చేసుకున్నాయి. కానీ, ఇక్కడ కేసులు రెట్టింపవ్వడానికి 17 రోజుల సమయం పడుతోంది.కర్ణాటకలో ప్రతి 9 రోజులకు కేసులు రెట్టింపు అవుతుంటే, తెలంగాణలో అది ప్రతి 10 రోజులకు జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసులు రెట్టింపయ్యే సమయం 13 రోజులు కాగా, కేరళలో 18 రోజులుగా ఉంది.బెంగళూరు, హైదరాబాద్ లో కేసులు పెరుగుతున్న తీరు చూస్తుంటే వచ్చే రెండు వారాలలో ఇన్ఫెక్షన్ పీక్ స్థాయికి చేరవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos