బోనాల పండుగ ఏర్పాట్లపై సమీక్ష

బోనాల పండుగ ఏర్పాట్లపై సమీక్ష

హైదరాబాద్‌ : వచ్చే నెల నాలుగో తేదీ నుంచి బోనాల పండుగ జరుగనుంది. దీనిని పురస్కరించుకుని ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సమీక్ష జరిపారు. గతంలో సెంట్రల్‌ హైదరాబాద్‌కు మాత్రమే ఈ పండుగ పరిమితమయ్యేదని, ఇప్పుడు బృహత్‌ హైదరాబాద్‌ మొత్తం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. పండుగ సందర్భంగా ప్రాధాన్య క్రమంలో ఆలయాలకు నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ఆలయాల వద్ద వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని, అంబులెన్స్ లను అందుబాటులో ఉంచుతామని వివరించారు. ప్రత్యేక ఆర్టీసీ బస్సులను కూడా నడుపుతామని ఆయన వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos