హువావేకు మళ్లీ ఊరట

  • In Money
  • August 19, 2019
  • 159 Views
హువావేకు మళ్లీ ఊరట

వాషింగ్టన్‌ : చైనా టెలికాం దిగ్గజం హువావేపై మరో 90 రోజుల పాటు నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. గతంలో 90 రోజుల పాటు తాత్కాలికంగా నిషేధాన్ని ఎత్తివేసిన సంగతి తెలిసిందే. అమెరికా వాణిజ్య కార్యదర్శి విల్బర్‌ రోస్‌ తాజా నిర్ణయాన్ని ప్రకటించారు. దరిమిలా అమెరికా కంపెనీలతో హువావే వ్యాపార లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. చైనా కోసం హువావే గూఢచర్యం చేస్తోందని గతంలో అమెరికా అధ్యక్షుడు ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ అనుమతి లేకుండా హువావే నుంచి అమెరికా సంస్థలు ఎటువంటి సాంకేతికతను కొనుగోలు చేయకూడదని ఆంక్షలు విధించారు. తాజా నిర్ణయంతో ఈ ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos