ఆకలి సూచీలో మరింత దిగజారిన భారత్

ఆకలి సూచీలో మరింత దిగజారిన భారత్

న్యూ ఢిల్లీ : అంతర్జాతీయ ఆకలి సూచీ 2022 లో భారత్ నిరుటితో ఏడాదితో పోలిస్తే ఆరు స్థానాలు కిందకు దిగజారింది. 107వ స్థానాన్ని దక్కించుకుంది. మొత్తం 121 దేశాలతో ఈ సూచీ ర్యాంకుల నివేదిక విడుదలైంది. అంతర్జాతీయ ఆకలి సూచీలో దేశాల ర్యాంకు కేటాయింపునకు ప్రధానంగా చూసే అంశాలు.. పోషకాహార లేమి (కావా ల్సినన్ని కేలరీలు లభించకపోవడం), చిన్నారుల మరణాలు, వృద్ధి సరిగ్గా లేకపోవడం, బరువు తక్కువ ఉండడం. దక్షిణాసియా దేశాల్లో అప్ఘానిస్థాన్ మినహా మిగిలిన అన్ని దేశాలు ఈ విషయంలో భారత్ కంటే మెరుగ్గా ఉండడం గమనించాలి. పాకిస్థాన్ 99, శ్రీలంక 64, బంగ్లాదేశ్ 84, నేపాల్ 81, మయన్మార్ 74వ ర్యాంకుల్లో నిలిచాయి. భారత్ కంటే దిగువన ఉన్నవి జాంబియా, అప్ఘనిస్థాన్, టిమోర్ లెస్టే, గయానా బిసా, సియెర్రా లియోన్, లెసోతో తదితర దేశాలున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos