హ్యుండై మోటార్స్‌పై కరోనా(కొవిడ్-19) ప్రభావం పడింది. ఆ సంస్థకు చెందిన ఒక కార్మికుడికి కరోనా వ్యాపించడంతో ఒక ఫ్యాక్టరీని మూసివేసింది. ఈ ఫ్యాక్టరీ ఉల్సాన్‌లో ఉంది. ఈ విషయాన్ని హ్యుందాయ్ శుక్రవారం ప్రకటించింది. చైనాలో కొత్త కేసుల నమోదు తగ్గి విడిభాగాల తయారీ సంస్థలు కోలుకొంటున్న సమయంలో హ్యుందాయ్ కీలకమైన ప్లాంట్ మూసివేయడం గమనార్హం. చైనా తర్వాత అత్యధిక మంది కరోనా వైరస్‌కు గురైన రెండో దేశం దక్షిణ కొరియానే. కరోన బాధితుడిని గుర్తించి ప్లాంట్‌ను మూసేసిన హ్యూండై, అతడితోపాటు పనిచేసే సహచరులను పర్యవేక్షణలో ఉంచింది. ఈ విషయాన్ని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉల్సాన్‌లో హ్యుండై ఐదు కారు ఫ్యాక్టరీలను నిర్వహిస్తోంది. ఇవి మొత్తం ఏటా 14 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయగలవు.