రూ.20 వేల బైకుకు రూ.42 వేల జరిమానా..

రూ.20 వేల బైకుకు రూ.42 వేల జరిమానా..

చేతిలో బండి ఉంది కదా అని అదే పనిగా ట్రాఫిక్ నిబంధనల్ని బ్రేక్ చేసే బెంగళూరి వాసికి తాజాగా అక్కడి పోలీసులు దిమ్మ తిరిగే షాకిచ్చారు. ఎంచక్కా బండి మీద వెళుతున్న అతగాడి వాహనం నెంబరును చెక్ చేసిన పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. అతగాడి తప్పుల చిట్టా భారీగా ఉండటంతో.. అతడ్ని ఆపారు. మొత్తం లెక్క చూస్తే.. అతడి మీద పెండింగ్ చలానాలు 77గా తేల్చారు. వాటికి చెల్లించాల్సిన జరిమానా మొత్తం రూ.42500.ట్రాఫిక్ నిబంధనల్ని ఈ రేంజ్ లో ఉల్లంఘించే ఇతడి మీద చర్యలకు ఉపక్రమించిన పోలీసులు.. ఆ భారీ మొత్తాన్ని చెల్లించాలని తేల్చారు. ఈ సందర్భంగా అతగాడి ఫైన్ల చిట్టా చలనా పేపర్ ఏకంగా రెండు మీటర్లు ఉండటం విశేషం. ఇంతకీ ఈ ఉల్లంఘనుడి పేరేమిటంటారా? అతగాడి పేరు అరుణ్. ఈ మొత్తం ఎపిసోడ్ లో మరో ట్విస్టు ఏమిటంటే.. అరుణ్ నడుపుతున్న స్కూటీ సెకండ్ హ్యాండ్. రూ.20వేలు పెట్టి కొన్నాడట.దానిపై ఇష్టారాజ్యంగా తిరుగుతూ ఉండటంతో పడిన చలానాలు ఏకంగా రూ.42500 కావటం.. ఆ మొత్తాన్ని తాను అప్పటికప్పుడు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పటంతో పోలీసులకు ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో.. అతడి బండిని సీజ్ చేసి.. చలానా మొత్తాన్ని కడితే ఇస్తానని చెప్పారు. రూ.20వేలు పెట్టి కొన్న బండికి పడిన రూ.42500 చలానా మొత్తాన్ని కడతాడా? అన్నది ప్రశ్న.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos