న్యూ ఢిల్లీ: చమురు ధరలపై చర్చ జరపాలని మంగళ వారం విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో ఉభయ సభలూ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. చర్చ కోసపం విపక్ష సభ్యులు సభలో పెద్దఎత్తున నినాదాలు చేసారు. గతంలో మాదిరి సభ ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. చుమురు ధరలపై చర్చ జరపాలని విపక్షాల ఆందోళనల నడుమ రాజ్యసభ, లోక్సభలో సోమవారం ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు.