ఆకలితో రెస్టారెంట్‌కు వెళ్లిన వ్యక్తి ఉడకబెట్టిన గుడ్లు,ఆమ్లెట్లు,శీతలపానీయాలకు రెస్టారెంట్ వేసిన బిల్లు గుడ్లు తేలేశాడు.కొన్ని గుడ్లు, ఆమ్లెట్లు,శీతలపానీయం తీసుకున్నందుకు అంతమొత్తంలో బిల్లు వేశారంటూ సదరు వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో బిల్లుతో సహా తన ఆవేదన పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.కార్తిక్ అనే వ్యక్తి ఈనెల 10వ తేదీన ముంబయిలోని ఫోర్ సీజన్స్ అనే హోటల్‌కు వెళ్లాడు.రెండు ఉడకబెట్టిన గుడ్లు,మూడు ఆమ్లెట్లు,మూడు శీతలపానీయాలు ఆహారంగా తీసుకున్నాడు.తినడం పూర్తయ్యాక హోటల్ సిబ్బంది తెచ్చిన బిల్లు చూసి గుడ్లు తేలేశాడు.ఎందుకంటే రెండు గుడ్లకు రూ.1,700,ఒక్కో ఆమ్లెట్‌కు రూ.850,ఒక్కో శీతల పానీయానికి రూ.260 చొప్పున ట్యాక్స్‌లతో కలిపి మొత్తం రూ.6.938 బిల్లు వేశారు.బిల్లుతో సహా తన ఆవేదనను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో నెటిజన్లు కార్తిక్ ట్వీట్‌పై పలు రకాలకు స్పందిస్తున్నారు.దీనిపై హోటల్ యజమాన్యం మాత్రం స్పందించలేదు.కొద్ది రోజుల క్రితం ముఖ నటుడు ‘దిల్ దడక్నే దో’ ఫేమ్ రాహుల్ బోస్‌కు చండీగఢ్లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ వారు రెండు అరటి పండ్లకు రూ.442.50 వసూలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై అధికారులు విచారణ జరిపి అధిక జీఎస్టీ వసూలు చేసినందుకు రూ.25వేల జరిమానా విధించిన విషయం తెలిసిందే..