తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి రెండవ వర్ధంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా కృష్ణగిరి జిల్లా వ్యాప్తంగా డీఎంకే పార్టీ నాయకులు కార్యకర్తలు కరుణానిధి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించారు హోసూరులో మాజీ మున్సిపల్ చైర్మన్ మాదేశ్ నేతృత్వంలో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి రెండో వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హోసూర్ రింగ్ రోడ్ లోని మైదానంలో కరుణానిధి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హోసూర్ ఎమ్మెల్యే ఎస్.ఎ. సత్య పాల్గొని దివంగత నేత కరుణానిధి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తరువాత 200 మందికి పైగా మహిళలకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎంకే పార్టీ నాయకులు ఆగ్రో నాగరాజ్ సుకుమార్ యువరాజ్ తదితరులు పాల్గొన్నారు