హొసూరు : క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని హొసూరు ప్రాంతంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద గల ఆర్‌సీ చర్చి, ప్రభుత్వ ఆసుపత్రి సంఘంలోని సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. హొసూరు సమీపంలోని బేరికే గ్రామీణ ప్రాంతాల్లో గల చర్చిలలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. క్రిస్మస్ తాత వేషధారి గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ చాక్లెట్లు పంచి పెట్టారు. తర్వాత దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రైస్తవులు సంబరాలు జరుపుకున్నారు.