హొసూరులో హోరెత్తిన ఎన్నికల ప్రచారం

హొసూరు : రాష్ట్రంలో ఈ నెల 27, 30 తేదీలలో రెండు విడతలుగా జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని అభ్యర్థుల ప్రచారం హోరెత్తింది. గ్రామ పంచాయతీల్లో అభ్యర్థులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. డీఎంకే, ఏడీఎంకే పార్టీల తరఫున కౌన్సిలర్ స్థానాలకు పోటీ పడుతున్న అభ్యర్థులు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికల ప్రచారం తుది ఘట్టానికి చేరుకోవడం వల్ల అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న అభ్యర్థులు, వార్డు సభ్యులు హోరా హోరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. బైరమంగలం పంచాయతీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న రాజమ్మ జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. తన ఎన్నికల చిహ్నమైన హ్యాండ్‌ రోలర్‌కు ఓటేయాల్సిందిగా ఆమె ఓటర్లను అభ్యర్థించారు. అదే పంచాయతీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రతిమా గోపాలరెడ్డి సైతం ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తన ఎన్నికల చిహ్నమైన బీగం-బీగం చెవికి ఓటేయాలని ఆమె ఓటర్లను అర్థిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos