
ఇచ్చాఫురం : హోలీ రంగు మరకల్ని శుభ్రం చేసుకునేందుకు, స్నానానికి బహుదా నదిలోకి దిగిన ఇద్దరు మిత్రులు -స్నిహిత్ (14), జితిన్ (14) గురువారం ఉదయం ప్రమాద వశాత్తూ నదిలో మునిగి మృతి చెందారు. ఇక్కడి ప్రయివేటు విద్యాసంస్థలో పదో తరగతి విద్యార్థులైన వీరిద్దరూ గురువారం ఉదయం స్నేహితులతో కలిసి హోలీ పండుగ చేసుకున్నారు. అనంతరం బహుదా నదిలో స్నానానికి దిగిన వారు మునిగి మృతి చెందారు. కన్నబిడ్డలను విగతజీవులుగా చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు విద్యార్థుల దేహాలను శవ పరీక్ష కోసం ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.