న్యూ ఢిల్లీ: కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలో హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతోన్న విషయం తెలిసిందే. వైరస్ రోగులతో అక్కడి ఆసుపత్రులు, శ్మశానవాటికలు కిక్కిరిసిపోతున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా హెచ్‌ఎమ్‌పీవీ వైరస్ ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తోంది. తాజాగా భారత్‌లో రెండు రెండు కేసులు వెలుగుచూశాయి. బెంగళూరు బాప్టిస్ట్ ఆసుపత్రి లో 3, 8 నెలల చిన్నారులకు ఈ వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని భారత వైద్య పరిశోధన మండలి సోమవారం ధృవీకరించింది.
.