లాక్‌డౌన్ ఇబ్బందులు,ఆర్థిక కష్టాలు తాళలేక వేలాది మంది వలస కూలి కార్మికులు కాలినడకన స్వస్థలాలకు వెళుతూ లాక్‌డౌన్‌ను మించి కష్టాలు ఎదుర్కొంటున్నారు.కొంతమంది మార్గంమధ్యలోనే ప్రాణాలు కోల్పోతుంటే మరికొంత మంది ఇళ్లకు చేరుకోలేక కుటుంబ సభ్యులను కోల్పోతున్నారు. కొద్ది రోజుల క్రితం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఓ వలస కార్మికుడు రోడ్డుపక్కన కూర్చొని ఏడుస్తున్న ఫోటో వెనుక దీనగాథ బయటకు వచ్చింది.బిహార్ రాష్ట్రానికి చెందిన రామ్ పండిట్ ఉపాధి వెతుక్కుంటూ ఢిల్లీకి వచ్చాడు.భవన నిర్మాణ పనులు చేసుకుంటూ సంపాదించిన మొత్తంలో తన ఖర్చులకు పోనూ మిగిలిన డబ్బును బిహార్‌లో ఉంటున్న తన కుటుంబానికి పంపించేవాడు.లాక్‌డౌన్ కారణంగా ఢిల్లీలోని చిక్కుకుపోయిన రాం పండిట్ ఇంటికి వెళ్లడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.దేశం మొత్తం లాక్‌డౌన్ విధించడంతో భార్య ముగ్గురు అమ్మాయిలు,ఏడాది వయసున్న కుమారుడు ఎన్ని కష్టాలు పడుతున్నారోనన్న ఆందోళనతో కాలినడకన స్వస్థలానికి బయలుదేరాడు.అయితే మార్గంమధ్యలో ఉండగానే పిడుగులాంటి వార్త రాం పండిట్‌ను మరింత కుంగదీసింది. ఏడాది లోపు వయసున్న అతడి కొడుక్కి జబ్బు చేయగా సరైన వైద్యం అందక పరిస్థితి విషమించింది. అతడి ప్రాణం నిలిచే అవకాశం లేదని తేలిపోయింది. కొడుకును చివరి చూపు అయినా చూసుకుందామని బయల్దేరాడు రాం కుమార్. కానీ అతను చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి.అక్కడ కొడుకు ప్రాణాల కోసం కొట్టు మిట్టాడుతున్నాడని ఫోన్లో తెలుసుకున్న రాం పుకార్ పండిట్ విలవిలలాడిపోయాడు. ఆ సమయంలో తీసిన ఫోటో .. అతని మనో వేదనకు , తన వారి కోసం నరాలు చిట్లిపోతున్నంత బాధతో విలపిస్తున్న తీరుకు అద్దం పడుతుంది. ఆ బాధతో ఏడుస్తూ మాట్లాడుతుండగా ఫొటో జర్నలిస్టు తీసిన ఆ చిత్రం ఇప్పుడు వైరల్ గా మారింది .ఆమె అతడి వివరాలు తెలుసుకుని, డబ్బులిచ్చి, పోలీసుల అనుమతి కూడా సంపాదించి అతణ్ని ఢిల్లీ దాటించింది. ఆమె చేసిన సహాయంతో బీహార్లోని బెగుసరాయ్ సిటీకి చేరుకున్నాడు కానీ అక్కడి నుంచి తన గ్రామానికి వెళ్లలేకపోయాడు.ఇంతా ప్రయత్నం చేసినా రాం పుకార్ తన వాళ్ళ దగ్గరకు వెళ్ళలేకపోయాడు . ఇంతలోతన ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడు. ఖననం కూడా జరిగిపోయింది. కొడుకును చివరి చూపైనా చూసుకోకుండా రాం పుకార్ కపూర్ క్వారంటైన్ లోనే విలవిలలాడాడు . ప్రస్తుతం బెగసరాయ్‌లోనే అతను క్వారంటైన్లో ఉన్నాడు. తన ఒక్కగానొక్క సంవత్సరం వయసున్న కుమారుడిని కోల్పోయిన తండ్రి పడుతున్న బాధ వర్ణనాతీతం . కొడుకు చనిపోయాడని తెలిసినా వెళ్ళలేకపోయాడు . ప్రస్తుతం బెగసరాయ్‌లో ఉన్న అతన్ని భార్య కుమార్తె దూరం నుండి చూశారు . కానీ కరోనా లాక్ డౌన్ ఒక వలస కార్మికుడికి వర్ణనాతీతమైన బాధను , మానని గాయాన్ని మిగిల్చింది..