బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్ణయాలు ఇతర రాష్ట్రాల ప్రజలు, నేతలకు స్పూర్తినిస్తున్నాయి. ప్రైవేటు సంస్థల్లో కూడా స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండు చేస్తూ తమిళనాట ఉద్యమమే మెుదలైంది. జగన్ ను ఆంధ్రా తలైవాగా అభివర్ణించి రహదారుల్లో ఫ్లెక్సీలు నిలిపారు. తాజా స్పందన కర్ణాటకలో.. ఆంధ్ర ప్రదేశ్ మాదిరి ఇక్కడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రభు త్వంలో విలీనం చేయాలని హీరే కరూర్ ఆర్టీసీ డిపో సిబ్బంది ఆందోళన చేసారు. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. తెలం గాణలో కూడా ఇదే మాదిరి పోరాటాన్ని అక్కడి ఆర్టీసీ సిబ్బంది ఆరంభించారు.