ఒవైసీపై మరో కేసు

ఒవైసీపై మరో కేసు

ఆగ్రా: అయోధ్య తీర్పు గురించి మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యల్ని ఆక్షేపించి ఉత్తర ప్రదేశ్, ఆగ్రా జిల్లా కాస్గంజ్ అఖండ ఆర్యవర్త నిర్మాణ సంఘ్ సంస్థ ఆయనకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. ‘ సుప్రీ కోర్టు తీర్పును దేశ ప్రజలు స్వాగతించారు. అయితే మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఒవైసీ, సాంబాల్ ఎంపీ సాఖి ఉర్ రెహ్మాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.అవి మానవతకు, సామాజిక ఐక్యతకు కూడా విఘాతమ’ని ఆ సంస్థ అధ్యక్షుడు భూపేశ్ శర్మ పేర్కొ న్నారు. వారికి వ్యతిరేకంగా ఎన్ఐఏ చట్టం కింద అభియోగాలు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos