న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ ముసా యిదాను ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఇక్కడ జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశం బుధ వారం ఆమోదించింది. త్వరలోనే దీన్ని హోం మంత్రి అమిత్షా పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. రక్షణ మంత్రి రాజ్సింగ్ ఇప్పటికే దీనిపై సూచన ప్రాయంగా తెలిపారు. దీని వల్ల బంగ్లా దేశ్, పాకిస్థాన్, అఫ్గాని స్థాన్ల్లో మత పరమైన వేధింపు లకు గురయిన ముస్లిమే తరులకు భారత పౌరసత్వం లభిస్తుంది. ఏ రకమైన పత్రాలు లేక పోయినా వారు ఇందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. భారత్లో 11 ఏళ్లు తప్పనిసరిగా నివసించి ఉండాలన్న నిబంధన గతంలో ఉండేది. దానిని ఇప్పుడు ఆరేళ్లకు తగ్గిం చినట్లు సమాచారం. ఈ ముసాయిదా కు ఈశాన్య రాష్ట్రాల్లో వ్యతిరేకత వ్యక్తమైంది.