న్యూ ఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలో శుక్రవారం రాత్రి 11:32 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప మాపనంపై దీని తీవ్రత 3.1 గా నమోదైంది. 10 కిమీలోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించలేదని అధికార్లు తెలిపారు.