వీఐపీ మూమెంట్‌పై ఏమీ చేయలేం..

వీఐపీ మూమెంట్‌పై ఏమీ చేయలేం..

వీఐపీ మూమెంట్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముఖ్యమంత్రి, గవర్నర్‌ తదితర ముఖ్యమైన ప్రజాప్రతినిధులు వెళ్లే సమయంలో గంటల తరబడి వాహనాలను నిలిపివేస్తుండడంతో వేసవి,వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సోమశేఖర్‌ అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారు.ద్విచక్రవాహనాల్లో పిల్లలతో వెళుతున్న సమయంలో వీఐపీల కోసం గంటల తరబడి ట్రాఫిక్‌ నిలిపివేస్తుండడంతో ఈ ఇబ్బందులు మరింత తీవ్రంగా ఉన్నాయంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల మూమెంట్ సమయంలో ట్రాఫిక్ నిలిపివేయడంపై ఎక్కడైనా చట్టం ఉందా, లేదా ఏదైనా జీవో ఉందా ఒకవేళ ఉంటే చూపించాలని పిల్ లో కోరారు పిటిషనర్ సోమశేఖర్. విచారణను స్వీకరించిన హైకోర్టు పిటీషనర్ వాదనలను పరిశీలించింది. అనంతరం సీఎం, గవర్నర్ తోపాటు తనకు కూడా వీఐపీ మూమెంట్ ఉందని అందువల్ల తాను ఈ పిటీషన్ ను విచారణ చేయలేనని హైకోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ పిటీషన్ ను మరో బెంచ్ కి బదిలీ చేయాలని రిజిస్ట్రార్ ను ఆదేశించారు.రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్ కాన్వాయ్ కోసం సుమారు 40 నిమిషాలపాటు ట్రాఫిక్ ను నిలిపివేశారు పోలీసులు. దాంతో వర్షంలోనే ప్రజలు నిలిచిపోవాల్సి వచ్చింది. దాంతో పోలీసులపై ప్రజలు తిరగడడిన పరిస్థితినెలకొంది..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos