న్యాయమూర్తులపై ట్రోల్స్..26 మందికి నోటీసులు ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు

న్యాయమూర్తులపై ట్రోల్స్..26 మందికి నోటీసులు ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు

అమరావతి : ఇటీవల ఏపీలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఇద్దరు న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిపై హైకోర్టులో క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్ దాఖలైంది. పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. కోర్టులలో పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసులకు సంబంధించి ఇద్దరు న్యాయమూర్తులపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని కోర్టు పేర్కొంది. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారని హై కోర్టుకు ఏజీ ఫిర్యాదు చేశారు. ఐడీలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బుద్ధా వెంకన్న, మాజీ న్యాయమూర్తి రామకృష్ణ సహా మొత్తం 26 మంది పేర్లను అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. గూగుల్, ట్విట్టర్, ఫేస్ బుక్లను కూడా పిటిషన్లో పేర్కొనడం జరిగింది. కోర్టు ధిక్కరణ కింద పరిగణలోకి తీసుకొని చర్యలు తీసుకోవాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. దీనిని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం వీరందరి ఐడీలను గుర్తించి నోటీసులు పంపాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos