నిర్మాతలకు భారమవుతున్న హీరోయిన్లు!

  • In Film
  • February 21, 2020
  • 159 Views
నిర్మాతలకు భారమవుతున్న హీరోయిన్లు!

కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన పంజాబీ బ్యూటీ మెహ్రీన్‌ కెరీర్‌ పరిస్థితి డౌన్‌ఫాల్‌లో ఉంది.కొద్ది కాలంగా మెహ్రీన్‌ నటించిన చిత్రాలన్నీ బోల్తా కొడుతుండడంతో మెహ్రీన్‌కు ఆఫర్లు కరువవుతున్నాయి.ఈ తరుణంలో మెహ్రీన్‌ తన ప్రవర్తనతో కెరీర్‌ను మరింత దెబ్బ తీసుకుంటోందనే చర్చలు జరుగుతున్నాయి. ఎంత మంచివాడవురా సినిమా కోసం ప్రీ రిలీజ్ ప్రమోషన్‌లో మెహ్రీన్ పాల్గొన్నది. మొత్తంగా రిలీజ్‌కు ముందు రిలీజ్‌కు తర్వాత మూడు నుంచి నాలుగు రోజులపాటు ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నది. అయితే ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన సమయంలో వేసుకొన్న దుస్తులు, అందంగా కనిపించేందుకు బ్యూటీ పార్లర్ బిల్లులను భారీగా పంపించడంతో చిత్ర యూనిట్ షాక్ అయినట్టు తెలిసింది.ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో ఫైవ్ స్టార్ హోటల్‌లో లాండ్రికి అయిన ఖర్చులు, స్పా బిల్లులు తడిసి మోపడవ్వడం.. ఆ బిల్లులను చూసిన నిర్మాతలు కంగుతిన్నరట. దాదాపు రూ.50 వేల బిల్లును నిర్మాత చూసి షాక్ తిన్నారట. వాస్తవానికి అలాంటి బిల్లులను నిర్మాతలు భరించడం చేయరు.ఫైవ్ స్టార్ హోటల్ నుంచి తెప్పించిన భోజనానికి కూడా బిల్లు పంపించడం చర్చనీయాంశమైంది. ఆ బిల్లు దాదాపు రూ.7 వేలు అవ్వడంతో ఆ బిల్లును కూడా కట్టమని సదరు నిర్మాతలకు చేరవేసిందట. అయితే ఇలాంటి కంప్లయింట్లు మెహ్రీన్‌పై రావడం ఇదే మొదటిసారి కాదని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.ఇక లేడీ సూపర్‌స్టార్‌గా దూసుకుపోతున్న నయనతారపై సైతం ఇటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి.కోట్లాది రూపాయల పారితోషకంతో పాటు నయనతారకు ప్రత్యేక కేరవాన్, బాడీగార్డ్స్వేతనాలు, ఆమె ప్రత్యేక మేకప్మన్, హెయిర్డ్రస్సెర్, వ్యక్తిగత అసిస్టెంట్, కారు డ్రైవర్వారందరికీ నిర్మాతనే వేతనాలు చెల్లించాల్సిన పరిస్థితి. వీటికి మాత్రమే రోజుకు రూ. 60 నుంచి 70 వేలు అవుతుంది. ఇవికాక నయనతార సొంత ఖర్చులకు కూడా నిర్మాతలపై మోపుతున్నట్లు, చివరికి తన వెంట వచ్చే ఆమె ప్రియుడు సరదాల ఖర్చు నిర్మాతలే  భరించాల్సివస్తోందనే ఆరోపణలపై నిర్మాతల మండలిలో చర్చ జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఇదే విషయాన్ని ఇటీవల నిర్మాత రాజన్ఒక వేదికపై నటి నయనతార పారితషికం గురించి మాట్లాడారు.దీంతో ఇకపై నయనతార వంటి స్టార్హీరోయిన్లకు కేరవాన్ల వసతి, ఇతర ఖర్చులను వారి పారితోషికాల నుంచే పెట్టుకోవాలనే నిబంధనను విధించాలని ఒత్తిడి నిర్మాతల మండలిపై పెరుగుతున్నట్లు సమాచారం. దీంతో ఇతర నటీమణులు దిగ్బ్రాంతికి గురవుతున్నట్లు సమాచారం. అదేవిధంగా నయనతారకు ఇలాంటి ఆరోపణలు పెద్ద దెబ్బేనంటున్నారు సినీ వర్గాలు. ఇప్పుటికే అవకాశాలు తగ్గాయని, ప్రస్తుతం చేతిలో ఒకటి రెండు చిత్రాలే ఉన్నాయని, కొత్త అవకాశాలు లేకపోవడంతో నిజంగా ఆమెపై వస్తున్న ఆరోపణలపై నిర్మాతల మండలి చర్యలు తీసుకుంటే కెరీర్ఇంకా  దారుణంగా తయారవుతుందని సినీ వర్గాల మాట

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos