ఫ్యాన్స్‌ వార్‌లో వేలుపెట్టిన సిద్ధార్థ్‌..

  • In Film
  • January 20, 2020
  • 175 Views
ఫ్యాన్స్‌ వార్‌లో వేలుపెట్టిన సిద్ధార్థ్‌..

పందెం కోళ్లలా సంక్రాంతి బరిలో దిగిన అలవైకుంఠపురములో,సరిలేరు నీకెవ్వరు చిత్రాలు పోటాపోటీగా వసూళ్లు సాధిస్తూ బ్లాక్‌బస్టర్‌ దిశగా దూసుకెళుతున్నాయి.అయితే తమ సినిమా విజేతంటే తమ చిత్రం విజేతని నిరూపించుకోవడానికి రెండు చిత్రాల బృందాలు వసూళ్లకు సంబంధించి పోటాపోటీ పోస్టర్లు వదులుతున్నాయి.ఈ నేపథ్యంలో మహేశ్‌-అల్లు అర్జున్‌ అభిమానుల మధ్య కొత్తగా మాటల యుద్ధం మొదలైంది. బన్నీ ఫ్యాన్స్ #FakeQueenMaheshBabu అనే ట్యాగ్  ట్రెండ్ అయ్యేలా చేయగా అందుకు మహేష్ బాబు అభిమానులు #FakingKaBaapAlluArjun అనే మరో ట్యాగ్ ట్రెండ్ అయ్యేలా చేశారు.శనివారం నుంచి ట్విట్టర్‌లో ఈ రెండు టాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఇది చూసిన హీరో సిద్ధార్థ్ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. #FakeQueenMaheshBabu, #FakingKaBaapAlluArjun అనే ట్యాగ్స్ ట్విట్టర్‌లో ట్రెండింగ్ అవుతున్నాయి.. లక్షల కొద్దీ ట్వీట్స్ చేస్తున్నారని.. దేవుడా మా సినిమాను కాపాడు అంటూ విమర్శిస్తూ రాసుకొచ్చాడు. అంతేకాదు.. ఫ్యాన్స్ ని ఉద్దేశిస్తూ సిగ్గుచేటు అనే పదాలను వాడాడు. దీంతో బన్నీ, మహేష్ ఫ్యాన్స్ కలిసి సిద్ధార్థ్ ని ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి వార్స్ మొదలైందే తమిళ చిత్ర పరిశ్రమనుంచి అని.. అక్కడేం మాట్లాడలేక.. తెలుగు సినిమాలు, హీరోలపై కామెంట్స్ చేస్తున్నాడని మండిపడుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos