మా హీరోని వదిలేయండి…

  • In Film
  • February 28, 2019
  • 160 Views

పుల్వామా ఉగ్రదాడి అనంతరం ఉగ్రవాదుల శిబిరాలపై యుద్ధ విమానాలతో
విరుచుకుపడి 300 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టి భారత వాయుసేన ప్రతీకారం తీర్చుకుంది.ఈ
ఘటన అనంతరం పాకిస్థాన్ వైమానిక దళాలు సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. వాటిని
తిప్పికొట్టే ప్రయత్నంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలెట్ అభినందన్ పాక్ ఆర్మీకి చిక్కారు.
అభినందన్ గాయాలతో కనిపిస్తున్నా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాకిస్థాన్
అదుపులో ఉన్నప్పటికీ అభినందన్ చెక్కు చెదరని ధైర్యంతో కనిపిస్తున్నాడని దేశం మొత్తం
ప్రశంసలు కురిపిస్తోంది. బ్రింగ్ అభినందన్ బ్యాక్ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్
అవుతోంది.అభినందన్‌ను వెంటనే భారత్‌కు అప్పగించాలంటూ దేశవ్యాప్తంగా సామాన్యుల
నుంచి సెలబ్రిటీల వరకు ముక్తకంఠంతో డిమాండ్‌ చేస్తున్నారు.దీనిపై సినీ హీరోలో రామ్‌,సిద్దార్థ్‌,నటి
తాప్సీలు ట్విట్టర్‌లో స్పందించారు..

మా హీరోని వదిలేయండి…

శాంతిని కోరుకుంటూ అద్భుతమైన ప్రసంగం చేసారు ఇమ్రాన్ ఖాన్ సర్. శాంతి మంత్రం జపించే మీ చేతుల్లో మా హీరో(అభినందన్)ఉన్నారు. ఆయన పట్ల మీరెలా వ్యవహరిస్తారో ఇండియా మొత్తం చూస్తోంది అని వ్యాఖ్యానించాడు.మా హీరోని వదిలిపెట్టండి అని రామ్ కోరాడు.

మరో హీరో సిద్దార్థ్ స్పందిస్తూ.. మా సైనికుల్ని టెర్రరిస్టులు చంపేశారు. వారి స్థావరాలని మేము నాశనం చేశాం. మా మనుషులు ఎవరూ చనిపోలేదని పాక్ అంటోంది. కానీ ఉగ్ర స్థావరాలు మా దేశంలో లేవు అని మాత్రం చెప్పడం లేదు. ఇప్పుడు మా పైలెట్ ని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడే మీ బుద్ది బయటపడుతోంది. పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దత్తు తెలుపుతోంది. కానీ ఇండియా అలా కాదు. ఈ నిజాన్ని ఎవరూ కాదనలేరు అని సిద్దార్థ్ ట్విట్టర్ లో వ్యాఖ్యానించాడు.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ అభినందన్ క్షేమంగా తిరిగిరావాలని
మిగిలిన సెలెబ్రిటీలు కూడా కోరుకుంటున్నారు. ఇలాంటిది జరుగుతుందనే సర్జికల్ స్ట్రైక్
జరిగినప్పుడు సంబరాలు చేసుకోలేదు అని తాప్సి వ్యాఖ్యానించింది. ఇండియన్ కమాండర్ అభినందన్
ధైర్యానికి శభాష్. దేశంలోకి ప్రతి ఒక్క పౌరుడు మీ రాక కోసం ఎదురుచూస్తున్నారు. మీకు
మేమంతా అండగా ఉన్నాం అని అనుపమ్ ఖేర్ వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos