బెంగళూరు: రేవ్ పార్టీ కేసులో పోలీసుల విచారణకు నటి హేమ సోమవారం గైరు హాజరయ్యారు. వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నందున విచారణకు హాజరుకాలేనని ఆమె నగర పోలీసులకు లేఖ రాశారు. విచారణకు హాజరయ్యేందుకు తనకు కొంత సమయం కావాలని పోలీసులను అభ్యర్థించారు. అయితే, హేమ అభ్యర్థనను సీసీబీ తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో విచారణకు రమ్మంటూ పోలీసులు మరోసారి నోటీసులు పంపనున్నట్లు సమచారం. రేవ్ పార్టీలో దొరికిన వారిలో డ్రగ్ తీసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిన 86 మందికి పోలీసులు నోటీసులు జారీ చేసింది.