హెలికాప్టర్ కూలి ఆరుగురు మృతి

హెలికాప్టర్ కూలి ఆరుగురు మృతి

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఒక హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మరణించారు. గురువారం ఉదయం ఉత్తరకాశి సరిహద్దు జిల్లాలోని గంగానానిలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న  పోలీసులు, విపత్తు సహాయ దళాలు సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్‌లో ఆరుగురు ప్రయాణికులు, పైలట్ ఉన్నట్లు సమాచారం.  ప్రమాదానికి కారణం స్పష్టంగా తెలియలేదు. ఈ సంఘటనపై వివరణాత్మక దర్యాప్తు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos