హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​లో మోసం

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​లో మోసం

జమ్ము : జమ్ము కశ్మీర్​లోని షోపియనా, పుల్వామా జిల్లాలో హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ శాఖల్లో ఘరానా మోసం బయటపడింది. కస్టమర్లు చేసిన ఫిక్స్​డ్ డిపాజిట్లను వారి అనుమతి లేకుండానే బ్యాంక్ అధికారులు విత్​ డ్రా చేశారు. ఇంకా వినియోగదారులకు తెలియకుండానే వారి ఖాతాల నుంచి రుణాలను తీసుకున్నారు. నకిలీ ఫిక్స్​డి డిపాజిట్​ పత్రాలు ఇచ్చి మోసానికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. షోపియాన్​ బ్రాంచ్​కు చెందిన కొంత మంది ఖాతాదారులకు జూన్​లో ఫిక్స్​డ్ డిపాజిట్ల నుంచి విత్​ డ్రా చేసినట్లు మెసేజ్​లు వచ్చాయి. అంతకుముందు 2023లో పుల్వామా బ్రాంచ్​ కస్టమర్లకు ఇలాంటి మెసెజ్​లు వచ్చినట్లు చెబుతున్నారు.”నేను తీసుకున్న రూ.1.35 కోట్ల రుణాన్ని చెల్లించి బ్యాంక్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్​ పొందాను. కానీ కొన్ని రోజుల తర్వాత నా ఖాతాలో రూ. 1.35 కోట్ల రుణం బ్యాలెన్స్ ఉన్నట్లు చూపించింది. ఇది కేవలం నగదు మోసమే కాదు. బ్యాంక్​పై మేము పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోవడమే. ఫిర్యాదు చేసి దాదాపు రెండు నెలలు అవుతున్నా బ్యాంక్​ ఇప్పటికి పట్టించు కోవడం లేదు. విచారణ జరుగుతుందనే చెబుతున్నారు.”అని ఖాతాదారు అసిమ్ వాని ఆక్రోశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos