కమలంతో కలవనందుకే ఐటి దాడులు

బెంగళూరు: జాతీయ స్థాయిలో రాజకీయ కూటమి ఏర్పాటుకు భాజపాతో చేయి కలపనందునే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆదాయపు పన్ను శాఖ దాడులతో తమ పార్టీ నేతల్ని బెదిరిస్తోందని మాజీ ప్రధాని దేవేగౌడ శుక్రవారం ఆరోపించారు. తమతో కలిసి వస్తే భారీ మొత్తంలో డబ్బులు ఎన్నికల నిర్వహణ కోసం ఇస్తామని భాజపా ఆశ చూపిందన్నారు. ‘ఎన్నికల ముందు కుమారస్వామిని ముంబయి రావాలని భాజపా నేతలు కోరారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం భారీ మొత్తంలో డబ్బులు ఇస్తామన్నారు. నా గురించి తెలిసిన కుమారస్వామి వారి ప్రతిపాదనను తిరస్కరించారు. నా తండ్రి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా భాజపాతో కలవలేనని వారికి తేల్చి చెప్పారు’ అని విశదీకరించారు. అంత కంటే ముందు తన మంతనాలకు భాజపా నేతలు చేసిన వినతిని తిరస్కరించినట్లు చెప్పారు. జేడీఎస్ మంత్రులు, వారి సన్నిహితుల ఇళ్లలో గురువారం ఆదాయపు పన్ను శాఖ సోదాలకు దిగింది. దీంతో ఆగ్రహానికి గురైన జేడీఎస్, కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై మండి పడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos