అమరావతి: భారీ ఉన్నత న్యాయస్థానం భవనం కురుస్తోంది. అన్ని గదుల్లోనూ పై కప్పు నుంచి నీరు కారుతోంది. సిబ్బంది బకెట్లతో నీటిని తోడి బయట పోసారు. విద్యుత్ ఉపకరణాలు దెబ్బతినకుండా కాపాడేందుకు వాటిని సురక్షిత స్థలానికి తరలించారు. సచివాలయం మాదిరే ఉన్నత న్యాయ స్థానం తాత్కాలిక భవనాన్ని కూడా నాణ్యత లేకుండా నిర్మించారని పలువురు విమర్శించారు. సంబంధిత వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వేగంగా సంచరిస్తోంది.