‘రిజైన్​ మోడీ’ హాష్​ ట్యాగ్ తొలగింపు..పునరుద్ధరణ

‘రిజైన్​ మోడీ’ హాష్​ ట్యాగ్ తొలగింపు..పునరుద్ధరణ

న్యూ ఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని రాజీనామా చేయాలని సామాజిక మాధ్యమాల్లో కొందరు #Resign Modi అంటూ హాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు. వాటిని ఫేస్ బుక్ తాత్కాలికంగా నిలిపేసింది. విమర్శలు రావడంతో పొరపాటున జరిగిందని ప్రకటించింది. ఆ హాష్ ట్యాగ్ లతో కూడిన పోస్టులను బ్లాక్ చేయాలంటూ భారత ప్రభుత్వం తమనేమీ అడగలేదని స్పష్టం చేసింది.కొన్ని పోస్టులు తమ ప్రమాణాలకు అనుగుణంగా లేనందునే వాటిని బ్లాక్ చేసామని వివరించింది. కేవలం భారత్ లో మాత్రమే వాటిని దాదాపు మూడు గంటల పాటు ఆ పోస్టులను బ్లాక్ చేసింది. ఆ తర్వాత పోస్టులను పునరుద్ధరించింది. అంతకుముందు ట్విట్టర్ కూడా పలువురి ట్వీట్లను తొలగించింది. కరోనా నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ కొందరు విమర్శించారు. తీవ్రమైన ఆక్సిజన్ కొరత, పడకల కొరత తదితర సమస్యల వల్ల ప్రధాని మోదీ రాజీనామా చేయాలని హాష్ ట్యాగ్ ద్వారా డిమాండ్ చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos