ఆ ఐఏఎస్‌ అధికారికి 53వ బదిలీ..

ఆ ఐఏఎస్‌ అధికారికి 53వ బదిలీ..

విధి నిర్వహణలో నిక్కచ్చి వ్యవహరిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు పోందిన ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాకు మళ్లీ బదిలీ అయింది. ఏడాది మార్చిలోనే శాస్త్ర సాంకేతిక విభాగానికి ప్రత్యేక కార్యదర్శిగా బదిలీపై వచ్చిన అశోక్‌ తాజాగా మళ్లీ పురావస్తు విభాగానికి బదిలీఅయ్యారు.అంతకుముందు హర్యానా ప్రభుత్వంలో క్రీడలుయువజన వ్యవహారాల విభాగంలో 15 నెలలు పనిచేశారు.28 ఏళ్ల సర్వీసులో అశోక్‌కు ఇది 53 బదిలీ కావడం గమనార్హం. కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు చెందిన స్కైలై ట్ హాస్పిటాలిటీప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ డీఎల్ ఎఫ్ మధ్య ఒప్పందం జరిగిన భూమి మ్యుటేషన్ ను 2012లో అశోక్ ఖే మ్కా రద్దు చేయటం సంచలనం సృష్టించింది. అక్రమంగా రద్దు చేశారంటూ ఖేమ్కాపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చార్జిషీటు నమోదు చేసి పదవి నుంచి బదిలీ చేసింది. హర్యానాలో నాడు ఖేమ్కాను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన బీజేపీఅధికారంలోకి రాగానే ఆయనను అడ్డు తొలగించుకుంది. కొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన బీజేపీనేడు అధికారంలోకి రాగానే ఆయనను అడ్డు తొలగించుకుంది. రవాణాశాఖ కమిషనర్ గా ఉన్న ఖేమ్కాను ప్రాధాన్యం లేని పురావస్తు శాఖమ్యూజియంల విభాగానికి బదిలీ చేసింది. అనంతరం యువజన వ్యవహారాలకు మార్చింది.తనకు జరిగిన తాజా బదిలీపై ఖేమ్కా ఎప్పట్లాగే ట్విట్టర్ లో తన అభిప్రాయాలు పంచుకున్నారు. పరిణామం చాలా బాధాకరం అని ఖేమ్కా తన బదిలీపై స్పందించారు. ‘మళ్లీ బదిలీ చేశారు. ఇక్కడ ఎలాంటి ప్రగతి లేకుండానే మళ్లీ మొదటికొచ్చాను. రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకొన్న మరుసటి రోజే.. సుప్రీంకోర్టు ఆదేశాలునిబంధనలు మరోసారి ఉల్లంఘనకు గురయ్యాయి. కొందరిని సంతృప్తపరిచేందుకు నన్ను చివరి మూలకు నెట్టేశారు. అవమానం నిజాయితీకి బహుమానంఅని అశోక్ ఖేమ్కా రాసుకొచ్చారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos