ఆంధ్రప్రదేశ్‌పై హరీశ్‌రావు పరోక్ష వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్‌పై హరీశ్‌రావు పరోక్ష వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మూడు రాజధానులని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేసిన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతిలో నిరసనలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి.అమరావతి రైతులు,ప్రజలతో పాటు విద్యార్థులు,ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల గురించి తెరాస మంత్రి హరీశ్‌రావు పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఏపీలో అల్లకల్లోలం కారణంగా ఐటీ ఉద్యోగులతోపాటు బ్యూరోక్రాట్లు వ్యాపారవేత్తలు హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నారని మంత్రి హరీష్ రావు చెప్పుకొచ్చాడు. దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం ఎంతో మెరుగ్గా ఉందన్నారు. చెన్నైలో మంచినీటి సమస్య బెంగళూరులో ట్రాఫిక్ సమస్య ఢిల్లీలో కాలుష్యం ముంబైలో అధిక ధరలు ఉంటే హైదరాబాద్ లో ఎలాంటి సమస్యలూ లేవన్నారు.హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారాయిహరీష్ చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి దీనిపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos