హైదరాబాదు:తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి హరీశ్‌రావుకు ఊరట లభిచంఇంది. ఆయనపై వేసిన ఎన్నికల పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఎన్నికల అఫిడవిట్‌లో హరీశ్‌రావు సరైన వివరాలు ఇవ్వలేదని గతంలో చక్రధర్ గౌడ్ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేటలో బీఆర్‌ఎస్ నుంచి హరీశ్‌రావు, కాంగ్రెస్ నుంచి హరికృష్ణ, బీఎస్పీ నుంచి చక్రధర్ గౌడ్ పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో గెలిచిన హరీశ్‌రావు అఫిడవిట్‌లో పూర్తి సమాచారం వెల్లడించకుండా రహస్యంగా ఉంచారని చక్రధర్ గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. తన కుమారుడి వివరాలను అఫిడవిట్‌లో వెల్లడించలేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై తాజాగా మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు దాన్ని కొట్టివేసింది.