చేయి పట్టుకున్న హార్థిక్‌ పటేల్

చేయి పట్టుకున్న హార్థిక్‌ పటేల్

అహ్మదాబాద్: కాంగ్రెస్‌ పార్టీలోచేరనున్నట్లు పాటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ మంగళవారం ఇక్కడ మాధ్యమ ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు.’కాంగ్రెస్ ర్యాలీలో ధికారికంగా కాంగ్రెస్‌లో చేరుతున్నా. సీనియర్ నేతలంతా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు’ అని హార్దిక్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పటిష్టతకు, గ్రామ గ్రామానికి సిద్ధాంతాలను తీసుకువెళ్లేందుకు పాటుపడతామని చెప్పారు. ‘మహాత్మా గాంధీ ఇదే రోజు దండి యాత్ర చేపట్టి బ్రిటిష్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టారు. అదే కాంగ్రెస్ పార్టీలో నేను చేరుతున్నాన’ని అన్నారు. సుభాష్ చంద్రబోస్, పంటిట్ నెహ్రూ, సర్దార్ పటేల్, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వంటి గొప్ప నేతలు గతంలో కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించి దేశ పటిష్టతకు ఎంతో పాటు పడ్డారని గుర్తు చేసారు.  2015లో పటేళ్ల రిజర్వేషన్‌ కోసం చేపట్టిన ఆందోళనతో హార్దిక్ పేరు దేశ మంతటా మారు మోగింది. తను ఎక్కడి నుంచి పోటీ చేయాలో నాయకత్వం తీర్మానిస్తుందని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos