న్యూ ఢిల్లీ : లాక్డౌన్ విధించిన కేంద్ర ప్రభుత్వం వలస కూలీల గురించి ఆలోచించక పోవటంతో వారు కూడు, నీడకు కరువయ్యారని క్రికెటర్ హర్భజన్ సింగ్ విమర్శించారు. వారికి ఆహారం, డబ్బులు అందించి ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇవ్వాలని కోరారు. ‘ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయని ఎవ్వరూ ఊహించి ఉండరు. పౌరుల భద్రతకు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వానికి ఇంకా సమయం ఉందని భావిస్తున’ని పేర్కొన్నాడు.‘ ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యతో పోల్చుకుంటే క్రికెట్ చాలా చిన్న విషయం. విపత్కర పరిస్థితుల్లో క్రికెట్, ఐపీఎల్ గురించి ఆలోచిస్తే అది స్వార్థం అవుతుంది. ప్రజలు సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంటేనే క్రీడలు జరగాలి. మనమంతా ఏకమవ్వాల్సిన తరుణమిది. దేశం మళ్లీ దృఢంగా నిల బడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల’ని పిలుపు నిచ్చాడు.