న్యూ ఢిల్లీ : కోయంబత్తూరులో 2010లో జరిగిన బాలిక పై సామూహిక లైంగిక దాడి, హత్య, ఆమె సోదరుడిని హత్య చేసినందుకు తనకు మరణ శిక్ష విధించటాన్ని సవాల్ చేస్తూ నేరగాడు మనోహరన్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని అత్యున్నత న్యాయస్థానం గురు వారం తోసిపుచ్చింది. ధర్మాసనంలోని జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ సూర్యకాంత్మనోహరన్కు విధించిన మరణ శిక్షను సమీక్షించే అవసరం లేదని తేల్చి చెప్పింది. అతడు నీచమైన నేరానికి ఒడిగట్టినట్లు స్పష్టీకరించింది. మరో న్యాయ మూర్తి సంజీవ్ ఖన్నా మాత్రమే తనకు వేరే అభిప్రాయం ఉందని చెప్పారు. మనోహరన్ ఉరి శిక్ష అమలుపై గత నెల్లో అత్యున్నత న్యాయస్థాని నిలుపుదల ఉత్తర్వును జారీ చేసింది. 2010, అక్టోబర్ 29న మనోహరన్, సహ నిందితుడు మోహన కృష్ణన్ మైనర్ బాలిక, ఆమె సోదరుడిని అపహరించి బంధించారు. బాలికపై లైంగిక దాడి చేసారు. అనంతరం వారిద్దరిపై విష ప్రయోగం చేశారు. అయినా వారు మరణించకపోవడంతో వారి చేతులను కట్టేసి పరాంబికులం-అఖియార్ ప్రాజెక్టు కాలువలోకి వారిని తోసివేసి దారుణ హత్యకు పాల్పడ్డారు. పోలీస్ ఎదురు కాల్పుల్లో సహ నిందితుడు మోహన కృష్ణ హతమయ్యాడు.