న్యూ ఢిల్లీ: నీటి వృథా నివారణకు శతాబ్ది రైళ్ల ప్రయాణికులకు ఒక లీటరుకు బదులుగా అరలీటరు రైల్నీర్ సీసాలివ్వాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం శతాబ్ది రైల్లో 5 గంటల ప్రయాణం చేసే వారికి అర లీటరు సీసాలను, అంతకంటే ఎక్కువ సేపు ప్రయాణం చేసేవారికి ఒక లీటరు నీటి సీసాలను అందిస్తున్నారు. నూతన ఆదేశాల ప్రకారం ప్రయాణికులు అడిగితే అదనపు సీసాలు ఇస్తారు. వాటికి నగదు చెల్లించాలి.