హత్యలతో నాకు సంబంధం లేదు..

హత్యలతో నాకు సంబంధం లేదు..

కొన్నినెలల కిందట తెలంగాణలోని హాజీపూర్ లో వెలుగుచూసిన అమ్మాయిల మృతదేహాలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. కిరాతకాలకు కారకుడు శ్రీనివాస్ రెడ్డి అని గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. తాజాగా, కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు శ్రీనివాస్ రెడ్డి ఎలాంటి ఆందోళన లేకుండా విచారణను తప్పుదోవ పట్టించే రీతిలో జవాబులు చెప్పడం విస్మయం కలిగిస్తోంది. కర్నూలులో జరిగిన సువర్ణ హత్యతో నీకు సంబంధం ఉందా? అని న్యాయమూర్తి ప్రశ్నించగా, ‘ఎవరా సువర్ణ.. నాకు తెలియదుఅంటూ దిగ్భ్రాంతికర రీతిలో సమాధానమిచ్చాడు.ఇక, హతులైన బాలికల దుస్తులపై ఉన్న వీర్యపు మరకలు, రక్తపు మరకల ఆనవాళ్లు నీవేనని ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలింది, దీనిపై నువ్వేమంటావు? అని ప్రశ్నించగా, పోలీసులు వాటిని బాలికల దుస్తులపై చల్లారంటూ జంకుగొంకు లేకుండా జవాబిచ్చినట్టు తెలిసింది. అశ్లీల వీడియోలు ఎక్కువగా చూస్తావా? అంటే, తన వద్ద ఆండ్రాయిడ్ ఫోన్ లేదని చెప్పాడు. పోలీసులు,గ్రామస్థులు చెప్పినవన్నీ ఆరోపణలని, గ్రామంలో కొంత మందికి తమ కుటుంబంతో భూ పంచాయితీలు ఉండటం వల్ల వారు అకారణంగా తమపై కక్ష గట్టారని న్యాయమూర్తికి చెప్పినట్లు తెలిసింది. పోక్సో న్యాయస్థానంలో జరుగుతున్న కేసు విచారణ జనవరి 3 తేదీకి వాయిదాపడింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos