అన్నార్తులపై అమెరికా సిఫాయిల దౌర్జన్యం

అన్నార్తులపై అమెరికా సిఫాయిల దౌర్జన్యం

న్యూ యార్క్: బతికేందుకు మెక్సికో సరిహద్దుల నుంచి రియో గ్రాండే నది దాటి టెక్సాస్ లోని డెల్ రియోలోకి ప్రవేశించిన హైతీ దేశస్తుల్ని అమెరికా వలస అధికారులు కొరడాలతో కొట్టి నదిలోకి గెంటి వేశారు. వలసదారులు ప్రాణాలు అరచేతపెట్టుకుని పరుగులు తీశారు. వేడుకున్నా అమెరికా అధికారుల మనసులు మాత్రం కరగలేదు. గత సోమవారం ఏఎఫ్ పీకి చెందిన పాల్ రాట్యే అనే ఫొటోగ్రాఫర్ ఆ దారుణ కాండను క్లిక్ మనిపించాడు. వాటిని అక్కడి అన్ని వార్తా పత్రికలు, మాధ్యమ సంస్థలు ప్రచారం చేసాయి. అధికారుల తీరుపై ప్రజలు మండిపడ్డారు. నెటిజన్లు ఆవేదన చెందారు. రాజకీయ నాయకుల విమర్శలు వెల్లువెత్తాయి. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి ఆ ఘటన చాలా దారుణమన్నారు. బైడెన్ సొంత పార్టీ డెమొక్రటిక్ నేతలే ఖండించారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేసారు. ఇటీవలి కాలంలో హైతీ నుంచి వేలాదిగా అక్రమంగా వలస వస్తున్న వారిని అడ్డుకోవడం కష్టమైపోతోందని అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే వచ్చిన వారిని విమానాల్లో తిరిగి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos