అమరావతి: భాజపా కన్నెర్ర చేస్తే ప్రాంతీయ రాజకీయ పక్షాల చిరునామా లేకుండా పోతాయని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు శుక్రవారం హెచ్చరించారు. ‘దేవాలయాలపై దాడులకు అడ్డుకట్ట పడడంలేదు. ఆకతాయిల పని అంటూ ప్రచారం చేసి, చర్యలు తీసుకోలేదు. దాడులపై చర్యలు తీసుకోవడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వ అకృత్యాలను ప్రజలు గమనిస్తున్నారు. రామతీర్థం వెళ్లాలంటే భాజపా నేతలకు ఎందుకు అనుమతి ఇవ్వరు. హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్న రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళతామ’ని చెప్పారు.