ఉప ఎన్నికలో బీజేపీ, జనసేన కలిసి పోటీ

ఉప ఎన్నికలో బీజేపీ, జనసేన కలిసి పోటీ

తిరుపతి : లోక్సభ ఉప ఎన్నికలో భాజపా, జనసేన కలిసి పోటీ చేస్తాయని భాజపా అధికార ప్రతినిధి నరసింహారావు వెల్లడించారు. బుధవారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు. కేవలం కుల, ధన రాజకీయాలు మాత్రమే ఉన్నాయి. తిరుపతి అభివృద్ధి కోసం వైకాపా, తెదేపాలు ఏం చేశాయో ముందు చెప్పాలి. ఏమీ చేయకుండానే ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నాయో వెల్లడించాలి. కాంగ్రెస్ పాలనలో అంతులేని అవినీతి జరిగింది. తెదేపా హయాంలో అవినీతి కోసమే అభివృద్ధి జరిగిందని విమర్శించారు. తిరుపతి ప్రాంతంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు భాజపా పూర్తిగా సహకరిస్తుంద’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos