
న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పక్షాలు రూ.ఆరు నుంచి రూ.పది వేల కోట్ల వరకూ నిధుల్ని వ్యయం చేయనున్నాయని భాజపా అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీ.వీ.ఎల్. నరసింహా రావు ఆరోపించారు. శుక్రవారం ఇక్కడ మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు అక్రమ సంపాదన వినియోగం ప్రజా స్వామ్యానికి పెను ముప్పు అని ఆక్రోశించారు. దరిమిలా మేట వేసిన రూ.వేల కోట్ల నల్ల ధనాన్ని పట్టుకోవాలని ఈసీకి సూచించినట్లు తెలిపారు. మరిందరు అధికారులను నియమించి. కొత్త పద్దతుల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేయాలని ఎన్నికల సంఘాన్ని కోరతా మన్నారు సీవిజిల్ యాప్ సాయంతో డబ్బుల పంపిణీ ఫొటోలు, వీడియోల్ని తెలపాలని కోరారు. తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. తేదెపా ప్రభుత్వం అవినీతిలో కూరుకు పోయిందన్నారు. ధన బలంతో ఎన్నికలు గెలవాలనుకునే వారు ప్రజా సేవ చేస్తారనుకుంటే పొరపాటే నన్నారు. అంచనాలకు మించి ఎన్నికల పందేరం నడుస్తోందని ఆరోపించారు. ప్రజా స్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని దుయ్యబట్టారు. మరిందరు అధికారులను నియమించి. కొత్త పద్దతుల్లో ప్రలోభాలకు అడ్డు కట్ట వేయాలని ఎన్నికల సంఘాన్ని కోరతామన్నారు.