మంత్రులకు పరాజయం తప్పదు…జీవీఎల్‌ జోస్యం

మంత్రులకు పరాజయం తప్పదు…జీవీఎల్‌ జోస్యం

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులందరూ ఓడిపోతారని, తెదేపాకు 18 స్థానాలు దక్కడం కూడా కష్టమేనని భాజపా ఎంపీ జీవీఎల్‌. నరసింహారావు జోస్యం చెప్పారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో మాదిరే ఆంధ్రాలో కూడా తెదేపా చిరునామా గల్లంతవుతుందన్నారు. చంద్రబాబు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేంద్రం రాయలసీమకు హైకోర్టును మంజూరు చేస్తే, చంద్రబాబు అమరావతిలో ఏర్పాటు చేశారని ఆరోపించారు. కాగా శుక్రవారం కర్నూలులో జరిగే ప్రధాని ఎన్నికల ప్రచార సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావాలని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos