న్యూ ఢిల్లీ : ‘రైతుల డిమాండ్లు ఆమోదించకుంటే.. ఈ ఉద్యమం 2024 వరకు కొనసాగుతుంది’అని జై కిసాన్ ఉద్యమ నేత గుర్బాక్ష సింగ్ బర్నాలా కుండ బద్దలు కొట్టారు. శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ” ఉచిత ఆఫర్లు ప్రకటిస్తూ ప్రైవేటు టెలికాం సంస్థలు ముందుగా మొత్తం మార్కెట్ను ఆక్రమించుకుని బీఎస్ఎన్ఎల్ వంటి ప్రభుత్వ సంస్థలు మూతపడేందుకు దారి తీసినట్లుగానే.. వ్యవసాయ రంగంలోకి ప్రైవేటు సంస్థలు వస్తున్నాయి. ఆ సంస్థలు రైతులతో ఒప్పందాలు కుదుర్చుకుంటే.. ఇక్క డా అదే జరుగుతుంది. ముందుగా ఆయా కంపెనీలు రైతులను తమ ఉచ్చులోకి లాగుతాయి. ఆ తర్వాత దోచుకుంటాయి. కాంగ్రెస్ తర్వాత భాజపా కూడా మా ఉద్య మా న్ని కించపరిచే ప్రయత్నం చేస్తోంది. రైతుల డిమాండ్లు ఆమోదించకుంటే.. ఈ ఉద్యమం 2024 వరకు కొనసాగుతుంది’అని గుర్బక్ష్ సింగ్ బర్నాలా తేల్చి చెప్పారు. ఫిబ్రవరి 18న దేశవ్యాప్తంగా రైలు రోకో చేపట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. ఇప్పటి వరకు ప్రభుత్వం, రైతుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ఫలితం లేదు.