గురజాడ ప్రతిష్టను రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలి

గురజాడ ప్రతిష్టను రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలి

విజయనగరం: తెలుగు సాహిత్య రంగంలో తనకంటూ చెరగని ముద్ర వేసిన మహోన్నత వ్యక్తి కన్యాశుల్కం సృష్టికర్త మహాకవి గురజాడ అప్పారావు ప్రతిష్టను (గృహాన్ని), గురజాడ రచించిన రచనలను సిఎం చంద్రబాబు, డిప్యూటి సిఎం పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేక శ్రద్ధతో కాపాడేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి కోరారు. శనివారం గురజాడ జిల్లా గ్రంధాలయం వద్ద ముందుగా స్వాతంత్య్ర సమరయోధుడు ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ప్రకాశం పంతులు 153వ జయంతి కార్యక్రమం నిర్వహించి పోస్టు కార్డుల ఉద్యమం ప్రారంభించారు. ఈ సందర్భంగా భీశెట్టి మాట్లాడుతూ.. గురజాడ ఇంటిలో ఆగస్టు 11న ఒక తాగుబోతు చొరబడి అక్కడ సాహిత్య పుస్తకాలను, సీలింగ్‌ ఫ్యాన్లను, టేబుళ్లను చిందరవందర చేస్తే ఎమ్మెల్యేలు, మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం లో కనీసం చలనం లేకపోవడం చాలా బాధ కలిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. జరిగిన దుచ్చర్యను తెలుసుకున్న దేశవ్యాప్త గురజాడ అభిమానులు పాలకుల నిర్లక్ష్యం పై మండి పడుతున్నారని అన్నారు,రాష్ట్రంలో పురావస్తు శాఖ గురజాడ గృహాన్ని కాపాడటంలో పూర్తిగా విఫలమైందని,ఎవరు అధికారంలో ఉన్నా గురజాడ అప్పారావు గృహానికి,సాహిత్యానికి తీరని అన్యాయం జరుగుతూనే ఉందని,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ద వహించాలని పౌర వేదిక నుండి పోస్టు కార్డుల ఉద్యమం ప్రారంభించామని, యువ పెద్ద ఎత్తున తరలివచ్చి లేఖలు రాస్తున్నారనిఅన్నారు,ఈ కార్యక్రమంలో పౌర వేదిక కార్యనిర్వాహక అధ్యక్షుడు పిడకల ప్రభాకరరావు, ప్రధాన కార్యదర్శి జలంత్రి రామచంద్ర రాజు, తుమ్మగంటి రామ్మోహన్‌ రావు,జక్కు రామకృష్ణ, గురజాడ ఇందిర, సుభద్ర దేవి, జయపాల్‌, దివాకర్‌, విజరు కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos